: వోల్వో బస్సు బాధితులతో కలసి బొత్సను కలవనున్న నాగం


ఈ రోజు ఉదయం బొత్స నివాసం ముందు ఆందోళన చేసిన పాలెం దగ్గర జరిగిన వోల్వో బస్సు ఘటన బాధితులను గోల్కొండ పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొద్ది సేపటి క్రితం బీజీపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి గోల్కొండ పీఎస్ కు వెళ్లి బాధితులను కలిసి, పరామర్శించారు. అక్కడ నుంచే బొత్సతో మాట్లాడి, అపాయింట్ మెంట్ తీసుకున్నారు. బాధితులలో ఐదారు మందితో బొత్సను కలవనున్నామని... వీరి డిమాండ్లపై ఆయనతో చర్చిస్తామని నాగం తెలిపారు. ఈ దారుణ ఘటనకు కారణమైన బస్సు యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News