: నీలం తుపాను ఇన్ పుట్ సబ్సిడీ త్వరలో విడుదల చేస్తాం: మంత్రి రఘువీరా
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం కిరణ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో సీఎం కిరణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, రఘువీరారెడ్డి హాజరయ్యారు. హెలెన్, లెహర్ తుపాను నష్ట తీవ్రతపై అంచనా వేసి, నివేదికలను డిసెంబరు 10 లోగా పంపాలని సంబంధిత ఉన్నతాధికారులను రఘువీరారెడ్డి ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న నీలం తుపాను ఇన్పుట్ సబ్సిడీ రూ. 437 కోట్లను రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు.