: అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ విజయవాడలో సర్పంచ్ ల ధర్నా


విజయవాడలో విద్యుత్ శాఖ ఏడీఈ ఆఫీస్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో సర్పంచ్ లు ధర్నా చేశారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. తాడిగడప గ్రామంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని అధికారులను నిలదీసినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులను అడిగినందుకు అదనంగా మరో కేసు పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా లేని వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News