: 10 ఏళ్లు నోర్మూసుకోండి: వామపక్షాలపై మమత మండిపాటు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఉగ్రరూపం దాల్చారు. వామపక్ష నేతలు పదేళ్లపాటు నోరు మూసుకుని ఉండాలని హెచ్చరించారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పేదరిక నిర్మూలన తదితర రంగాలను వామపక్షాలు తమ 34 ఏళ్ల పాలనలో నాశనం చేశాయని ఆమె ఆరోపించారు. 'పదేళ్లు నోటికి ప్లాస్టర్ వేసుకోండి. ఒక్క మాట కూడా మాట్లడవద్దు' అంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నించిన వామపక్ష సభ్యులపై మండిపడ్డారు. దీంతో వామపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.