: తెలంగాణకు ప్రత్యేక పాలనా మండలి?


తెలంగాణ రాష్ట్ర డిమాండ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్రాదేశిక మండలి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అసోంలోని బోడో ప్రాంతానికి ఇచ్చినట్లే తెలంగాణ ప్రాంతానికి కూడా అధికారాలతో కూడిన ప్రత్యేక పాలనా మండలి ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ యోచన.

అభివృద్ధి నిధులు, అధికారాల బదిలీ కూడా ఉంటుందని సమాచారం. శాంతి భద్రతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోనే వుంచి, మిగతా అధికారాలను తెలంగాణ ప్రాదేశిక మండలికి బదిలీ చేయాలని
ఆలోచిస్తున్నారు. త్వరలో జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

  • Loading...

More Telugu News