: 'నిర్భయ' కేసులో బాల నేరస్థుడిని విచారించాలని సుప్రీంలో పిటిషన్


సంచలనం సృష్టించిన 'నిర్భయ' కేసులో పదిహేడేళ్ల బాల నేరస్థుడిపై విచారణ జరపాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బాల నేరస్థుడిని నిందితుడిగా నిర్ధారించిన జువనైల్ జస్టిస్ బోర్డు... జువనైల్ జస్టిస్ చట్టం కింద మూడేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గతంలో ఈ తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారని వారి తరపు న్యాయవాది తెలిపారు.

  • Loading...

More Telugu News