: అప్పుడే రిటైర్మెంటా?: విశ్వనాథన్ ఆనంద్
విశ్వనాథన్ ఆనంద్ చెస్ నుంచి విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందంటూ వినిపిస్తున్న వార్తలకు ఆయనే బ్రేక్ వేశారు. ప్రపంచ చెస్ చాంపియన్ టోర్నమెంట్ లో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ఆనంద్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రిటైర్మెంట్ పై కథనాలు వినిపిస్తున్నాయి. వీటిపై ఆనంద్ స్పందిస్తూ.. రిటైర్మెంట్ గురించి ఇప్పటికైతే ఆలోచించడం లేదని, అందుకు ఇంకా సమయం ఉందని తెలిపారు.