: భద్రాచలంలోని ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం: రేణుకా చౌదరి
ఖమ్మం జిల్లాలోని నాయక గూడెంలో పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కార్ల యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. భద్రాచలంలోని ఒక్క అంగుళాన్ని కుడా సీమాంధ్రలో కలిపేందుకు అంగీకరించమన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ కేంద్రాన్ని, అధిష్ఠానాన్ని ధిక్కరించలేదన్నారు. విభజనతో వచ్చే సమస్యలు మాత్రమే లేవనెత్తారన్నారు. సీఎం చూపిన సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్న రేణుక, విభజన ప్రక్రియ సజావుగా సాగడానికి కిరణ్ సహకరిస్తారన్నారు.