: ట్రైబ్యునల్ తీర్పు రద్దు చేయాలంటూ తెదేపా ఆందోళన
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు... రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు శరాఘాతమని టీడీపీ నేత దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద జాతీయరహదారిపై ఈ రోజు తెదేపా శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ, మన రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాది సుదర్శన రెడ్డి అసమర్థత వల్లే మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని విమర్శించారు.