: మచిలీపట్నంలో ప్రతిష్ఠాత్మక మెరైన్ పోలీసు అకాడమీ?


రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక పోలీసు శిక్షణ అకాడమీ రానుంది. మెరైన్ పోలీసు అకాడమీని మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. సముద్రంలో తీర ప్రాంత గస్తీ, చొరబాట్లను అరికట్టే విధులను మెరైన్ పోలీసులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం సాధారణ పోలీసులనే ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు శిక్షణ అకాడమీలను ఏర్పాటు చేయాలని తలపెట్టింది.

తూర్పు తీరంలో శిక్షణ అకాడమీ కోసం రాష్ట్రంతోపాటు, ఒడిశా, తమిళనాడు పోటీ పడుతున్నాయి. అయితే, దీనిని మచిలీపట్నంలోనే ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 300 ఎకరాలను గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐపీఎస్, సీఐఎస్ఎఫ్ అకాడమీలు ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News