: సోనియాను వ్యతిరేకించడం వల్లే నాకీ కష్టాలు: సుబ్రతారాయ్
సహారా గ్రూపు వేలాది మంది ఇన్వెస్టర్లకు 25వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు, సెబీ కఠినంగా వ్యవహరిస్తూ సహారా గ్రూపుతో బకాయిలు కక్కించే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేసే సెబీ అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. సహారా గ్రూపు సుబ్రతారాయ్ కు ఊపిరి సలపనీయకుండా చేస్తోంది. కానీ సుబ్రతారాయ్ మాత్రం దీనికి కొత్త భాష్యం చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం వల్లే బాధితుడిగా మారానని, ఒంటరివాడినయ్యానని చెప్పారు. విదేశీయులు దేశ ప్రధాని కాకూడదంటూ.. అప్పుడు యూపీఏకు మద్దతివ్వాలనుకున్న వామపక్షాలకు తెలిపానని పేర్కొన్నారు. అంటే సోనియా కక్షగట్టారా? అని అడగ్గా అదేమీ లేదని.. ఆమె పక్కనున్న వారి పనే ఇదన్నారు.