: నేడు అంగారకుడివైపు దూసుకుపోనున్న 'మార్స్ ఆర్బిటర్'


భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి, అంగారకుడిపైకి పంపిన మార్స్ ఆర్బిటర్ (మామ్) ఈ అర్థరాత్రి భూ కక్ష్యను దాటనుంది. అంతా సవ్యంగా జరిగితే మామ్ కీలక అంచెలోకి చేరుతుంది. ఈ అర్థరాత్రి 12.49 గంటలకు ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్ ను 23 నిమిషాల పాటు మండించడం ద్వారా దాన్ని భూ కక్ష్య వెలుపలికి తరలిస్తారు. వెంటనే మామ్ ను అంగారక గ్రహం వైపు మళ్లిస్తారు. అనంతరం, సుదూర ప్రయాణం చేసి, వచ్చే ఏడాది సెప్టెంబర్ 24 ఉదయం 6.45 గంటలకు అంగారకుడి చుట్టూ ఉన్న 366X80,000 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి మామ్ ప్రవేశిస్తుంది. ఈ అర్థరాత్రి నిర్వహించనున్న అత్యంత కీలకమైన చర్యపై ఇస్రో వర్గాలు తీవ్ర ఉత్కంఠలో ఉన్నాయి. మామ్ ను ఈ నెల 5న భూ కక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News