: నానో ఇక చౌక కాదు!.. కొత్త రూపు
నానో చౌక కారు మంత్రం బెడిసికొట్టిందని టాటా గ్రూపు ఎమిరటస్ చైర్మన్ రతన్ టాటా వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. నిజానికి ద్విచక్రవాహన దారులను దృష్టిలో పెట్టుకుని నానోకారును తెచ్చామే కానీ, ఇది చౌక కారు కాదన్నారు. నానోకు కొత్త రూపు, కొత్త హంగులద్ది ముందుగా ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసిన తర్వాత భారత్ లో ప్రవేశపెడతామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు టాటా 12,322 నానో కార్లను మాత్రమే విక్రయించిందంటే ఆదరణ ఎంత పేలవంగా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం నానో కారు ధరలు రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.60లక్షల వరకు ఉన్నాయి.