: భారతీయ నర్సులకు జర్మనీలో డిమాండ్‌!


భారతీయ నర్సులకు తమ దేశంలోని చికిత్స విధానాలు విధివిధానాలకు, నియమనిబంధనలకు అనుకూలంగా శిక్షణ ఇప్పించి, తమ దేశంలో ఉద్యోగాల్లో నియమించుకునేందుకు జర్మనీ కొత్తగా ఒక పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. జర్మనీలోని హాస్పిటళ్ల అవసరాలు తీర్చేందుకు ఇలాంటి కార్యక్రమంతో రూపొందించిన పైలట్‌ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

జర్మనీ వైద్యసేవల్లో యుక్తవయస్సుల్లోని నర్సింగ్‌ సేవలు అందించే వారి కొరత బాగా ఉన్న కారణంగా.. భారతదేశంలోని నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఓ పైలట్‌ ప్రాజెక్టు పెడుతున్నట్లు, కన్సల్టెంట్ జర్గన్‌ మానికే తెలిపారు. జర్మనీలోని అంతర్జాతీయ వృత్తిపరమైన శిక్షణల సంస్థకు ఆయన సేవలందిస్తున్నారు.

భారతదేశంలో నర్సింగ్‌ కోర్సు చేసిన వారికి ఇప్పటికే పలు దేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. యూఎస్‌, అరబ్‌ దేశాల్లో పెద్దసంఖ్యల్లో ఇక్కడినుంచి వెళ్లిన నర్సులే పనిచేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు జర్మనీ కూడా అదే బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News