: భాగ్యనగరంలో ప్రారంభమైన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్
రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ట్రావెల్ మార్ట్ ను పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ ప్రారంభించారు. పర్యాటక రంగ అభివృద్ధికి ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని చందనాఖాన్ చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన 132 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.