: బోధ్ గయ మందిరం స్వర్ణమయం
దాదాపు 1500 సంవత్సరాల కిందటిదిగా భావించే ప్రముఖ బౌద్ధక్షేత్రం బోధ్ గయ మందిరానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. బీహార్ లోని గయజిల్లాలో ఉన్న ఈ మందిరానికి బంగారు తాపడం పనులు చేసేందుకు థాయ్ లాండ్ మహారాజు, ఇతర బౌద్ధమతస్తులు 300 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ధాయ్ లాండ్ కు చెందిన నిపుణుల బృందం బంగారు తాపడం పనులను ఈ నెలలోనే ప్రారంభించి పూర్తి చేసింది. థాయ్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పనులను 'ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా'(ఏఎస్ఐ) పర్యవేక్షించినట్టు మహాబోధి మందిర ప్రధానార్చకుడు బిక్షు చలిందా తెలిపారు.