: బ్యాంక్ నగదు, ఖాతాదారుల వ్యక్తిగత లాకర్లు సేఫ్ : మహేష్ బ్యాంకు మేనేజర్
హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్ మహేష్ బ్యాంక్ శాఖలో ఇవాళ జరిగిన దోపిడీ ఘటనలో చోరీకి సంబంధించిన విషయాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారని మహేష్ బ్యాంక్ మేనేజర్ శర్మ పేర్కొన్నారు. చోరీ ఘటనలో బ్యాంక్ బంగారు ఆభరణాల చోరీ జరిగిందన్నారు. బ్యాంక్ నగదు, ఖాతాదారుల వ్యక్తిగత లాకర్లు సురక్షితమని, ఖాతాదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్మ చెప్పారు.