: ట్రైబ్యునల్ తీర్పు బాధాకరం: హరికృష్ణ
కృష్ణా జలాల కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పు ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా రావడం బాధాకరమని టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నిర్లక్ష్య వైఖరితోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందన్నారు. నీటి వాటాల కోసం పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు విభజన కోసం సహకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.