: ట్రైబ్యునల్ తీర్పుకు నిరసనగా టీడీపీ ఆందోళన
నదీ జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నిరసిస్తూ కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో టీడీపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ, దాసరి బాలవర్థనరావులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.