: రైళ్లలో భదత్ర, ఆహారం విషయంలో రాజీపడం : మంత్రి కోట్ల
రైళ్లలో భదత్ర, ఆహారం, సదుపాయాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలిపారు. వచ్చే 3, 4 నెలల్లో సికింద్రాబాద్, విశాఖ మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. రైల్వే లెవల్ క్రాసింగులను ఎత్తివేసి.. అండర్, ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని తద్వారా ప్రమాదాలను నివారిస్తామని మంత్రి చెప్పారు.