: చెరకు టన్నుకు రూ. 2550 చెల్లింపు: డెల్టా షుగర్స్


కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంలోని డెల్టా షుగర్స్ కర్మాగారంలో 2013-14వ సంవత్సరం క్రషింగ్‌ను డెల్టా షుగర్స్ సీఈవో సుబ్బరాజు ప్రారంభించారు. చెరకు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా టన్నుకు 365 రూపాయలు ఎక్కువ చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. చెరకు సాగును ప్రోత్సహించడానికి రైతులకు అవసరమైన ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరకు ధర టన్నుకు రూ.2,125 మద్దతు ధర ప్రకటించగా, రాష్ట ప్రభుత్వం కొనుగోలు పన్ను రూ.60తో కలిపి రూ.2,185గా నిర్ణయించామని సుబ్బరావు చెప్పారు. మార్కెట్లో చక్కెర ధర తక్కువగా ఉన్నా రైతు సంక్షేమం కోసం టన్నుకు అదనంగా 365 రూపాయలు కలిపి 2,550 రూపాయల చొప్పున చెల్లిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News