: ఆరుషి తల్లిదండ్రులను ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం?


కూతురు ఆరుషి, పనివాడు హేమరాజ్ హత్యల కేసులో జీవితకాల జైలు శిక్ష పడ్డ వైద్య దంపతులు రాజేశ్, నుపుర్ తల్వార్ లను త్వరలో ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ ఘజియాబాద్ లోని దస్నా జైలులో ఉన్నారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ వీరేశ్ శర్మ మాట్లాడుతూ.. పశ్చిమ ఉత్తరప్రదేశ్ కోర్టు నిబంధనల ప్రకారం ఏడేళ్లు లేక అంతకంటే ఎక్కువ శిక్ష పడ్డ వారిని ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలిస్తామని చెప్పారు. మరోవైపు తల్వార్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ సింగ్ కు రాసిన లేఖలో.. తమను ఆగ్రా జైలుకు తరలించేలా చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో తమ బంధువులు, తమ ముగ్గురు లాయర్లు ఉన్నారని వివరించారు. ఆ లేఖ డైరక్టర్ జనరల్ కు చేరిందన్నారు.

  • Loading...

More Telugu News