: ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సెమీస్ కు దూసుకెళ్లిన సైనా
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ లో భారత బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ సెమీఫైనల్లో ప్రవేశించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా క్వార్టర్ ఫైనల్లో 23-21, 19-21, 21-16తో చైనా షట్లర్ షిజియాన్ వాంగ్ (ఆరో ర్యాంకు) ను చిత్తు చేసింది.
కాగా, కెరీర్లో ఎన్నో సూపర్ సిరీస్ లు గెల్చిన సైనాకు ఇప్పటి వరకు ఆల్ ఇంగ్లండ్ టోర్నీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. గతంలో ఓసారి సెమీస్ చేరినా ఫలితం దక్కలేదు. ఈసారైనా సైనా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో విజేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. సెమీస్ లో సైనా.. థాయ్ క్రీడాకారిణి రత్నచోక్ తో తలపడుతుంది.