: మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు వృథా: కోడెల


కృష్ణా జలాల పంపిణీపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మిగులు జలాలు కోరబోమంటూ దివంగత వైఎస్ ఇచ్చిన లేఖ వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు వృథా అని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందని కోడెల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇంప్లీడ్ అవుతామని కోడెల శివప్రసాదరావు సూచన చేశారు.

  • Loading...

More Telugu News