: నెల్లూరులో ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన భూ తగాదా
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిల్లకూరు మండలం తుముకుమాలలో కుటుంబ వ్యక్తుల మధ్య ఎప్పటినుంచో ఉన్న భూ తగాదాలు ఇవాళ ఘర్షణకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో, రవి అనే వ్యక్తి వదినపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరో మహిళపై కూడా దాడికి దిగాడు. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు. ఐదు సెంట్ల భూమి కోసం ఈ వివాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.