: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 11 నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. హాల్ టిక్కెట్లు అందకపోవడంతో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పరీక్షలను 14వ తేదీ నుంచి నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.