: రాష్ట్ర ప్రభుత్వం తీరువల్లే ఇప్పుడీ దుస్థితి: సీనియర్ న్యాయవాది
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2010లో ఇచ్చిన మధ్యంతర తీర్పుపై అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాగ్రత్త వహించి తమ వాదన గట్టిగా వినిపించి ఉంటే, ఇప్పుడీ దుస్థితి వచ్చేదే కాదని హైకోర్టు సీనియర్ న్యాయవాది రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు గతంలో మిగులు జలాలు కోరమని అండర్ టేకింగ్ ఇచ్చిందని, ఇప్పుడదే రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. ఈ తీర్పు వల్ల రాష్ట్రంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.