: 'ఇండియన్ డయాస్పోరా'లో నేడు మోడీ ప్రసంగం
వార్టన్ ఇండియా ఆర్ధిక సదస్సులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేయాల్సిన ప్రసంగం రాజకీయ నాటకీయ పరిస్థితుల మధ్య రద్దయిన సంగతి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇందుకు దీటుగా బీజేపీ అనుకూలురు మోడీ ప్రసంగాన్ని మరో సదస్సులో ఏర్పాటు చేశారు.
ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన 'ఇండియన్ డయాస్పోరా' సభలో ఈ రోజు ఆయన ఉపన్యసించనున్నారు. అమెరికాలోని ఎడిసన్, న్యూజెర్సీ, చికాగో, ఇల్లినాయిస్ రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన సభల్లో ఏకకాలంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడనున్నారు.
ఈ ప్రసంగం శనివారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల (ఈస్ట్రన్ స్టాండర్డ్ టైమ్) వరకు జరుగుతుందని బీజేపీ మిత్రులకు చెందిన వెబ్ సైట్ తెలిపింది. అహ్మదాబాద్ లోని కర్నావతి నుంచి మోడీ ప్రసంగిస్తారు.