: డిసెంబర్ 4న ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో సెలవు ప్రకటించండి : ఆప్


ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 4న ఢిల్లీలో ఎన్ సీఆర్ ప్రాంతంలో కూడా సెలవు ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. సెలవు ఇస్తే ఈ ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని తెలిపింది. ఢిల్లీలో సెలవు అయినా ఎన్ సీఆర్ ప్రాంతంలో ఉన్న నోయిడా, గురుగావ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో పని దినమే. దీంతో ఇక్కడ పని చేసే ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం ఉండదని.. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వంతోనూ, సంబంధిత రాష్ట్రాలతోనూ సంప్రదించి సెలవు ప్రకటించాలని కోరింది.

  • Loading...

More Telugu News