: జైపూర్ చేరుకున్న పాక్ ప్రధాని
పాకిస్తాన్ ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్ జైపూర్ చేరుకున్నారు. ఇక్కడి పవిత్రమైన అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించేందుకు ఆయన నేడు భారత్ విచ్చేశారు. కాగా, పాక్ ప్రధాని ఇక్కడికి వస్తే ఆయనకు ప్రార్ధనల్లో సహకరించబోమని దర్గా ప్రధాన గురువు జైనుల్ అబెదిన్ హెచ్చరించిన నేపథ్యంలో రజా అష్రాఫ్ రాక ఆసక్తికరంగా మారింది.