: నెల్లూరు జిల్లాకు అక్రమంగా విదేశీ మద్యం


నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు చెన్నై నుంచి బస్సు, రైళ్ల ద్వారా విదేశీ మద్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. జానీ వాకర్, గ్రాంట్స్ వంటి బ్లెండెడ్ స్కాచ్ ను నెల్లూరులోని కొన్ని కస్టమ్స్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు. జానీ వాకర్ ఫుల్ బాటిల్ మార్కెట్లో రూ. 3,500 ఉండగా, అది బయట రూ. 3 వేలకే దొరుకుతోంది. విదేశీ బ్రాండ్లు చౌకగా దొరకడంతో మందుబాబులు గుట్టుచప్పుడు కాకుండా కొనుక్కొంటున్నారు. అక్రమ మద్యం అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. దీంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు విదేశ మద్యం విక్రయాలపై నిఘా పెట్టారు. తనిఖీలు నిర్వహించి విదేశీ మద్యం బాటిళ్లు కలిగి ఉన్నా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News