: ఢిల్లీ నుంచి గోవా బయల్దేరిన తేజ్ పాల్
తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఢిల్లీ నుంచి గోవా బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఆరుగురు ఉన్నారు. గోవా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా పరారీలో ఉన్న తేజ్ పాల్... ముందస్తు బెయిల్ పై గోవా కోర్టు తీర్పును మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేయడంతో గోవా బయల్దేరి వెళ్లారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై తేజ్ పాల్ గోవా పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు.