: ఈ నెల 16, 17 తేదీల్లో బీజేపీ రాష్ట్ర సమావేశాలు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 16,17 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన ఈరోజు హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్టంలో పర్యటించనున్నట్టు వెంకయ్య నాయుడు చెప్పారు. వివిధ వర్గాలను కలుపుకుని పోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్ధేశమని ఆయన వివరించారు. ప్రస్తుతం యూపీఏ సర్కారు అవినీతి మయమైందని, స్వచ్ఛమైన పాలన ఎన్డీఏతోనే సాధ్యమని ఆ యాత్రలో ప్రచారం చేస్తామని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.