: రాష్ట్ర విభజనతో ట్రైబ్యునల్ కు సంబంధం లేదు: సుదర్శన్ రెడ్డి
మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు లేదని, స్వేచ్ఛ మాత్రమే ఉందని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సుదర్శన్ రెడ్డి అన్నారు. తీర్పు అనంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ పై తీర్పు తరువాతే... ట్రైబ్యునల్ తీర్పుపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఏం చేయాలనే దానిపై ట్రైబ్యునల్ కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.