: రాజేశ్, నుపుర్ తల్వార్ లు కలుసుకునేందుకు జైలు అధికారుల అనుమతి
కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్ జంట హత్యల కేసులో జీవిత ఖైదు పడ్డ వైద్య దంపతులు రాజేశ్, నుపుర్ తల్వార్ లు ప్రస్తుతం ఘజియాబాద్ లోని దస్నా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులోని పురుషుల పదకొండవ బ్యారక్ లో రాజేశ్, మహిళల 13వ బ్యారక్ లో నుపుర్ ఉన్నారు. దాంతో, వారు కలుసుకుని మాట్లాడుకునేందుకు జైలు అధికారులు అనుమతినిచ్చారు. ప్రతి శనివారం కలుసుకుని, నలభై నిమిషాల పాటు మాట్లాడుకోవటానికి అనుమతి కల్పించారు. జైలు సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్ మాట్లాడుతూ.. దంపతులైన ఖైదీలు ప్రతివారం జైలు లోపలున్న పార్క్ లో కలుసుకోవటానికి సమయం ఇస్తామని చెప్పారు.