: ప్రారంభమైన అరకు ఉత్సవాలు... ఉత్సాహంగా ఆడి పాడిన గిరిజనులు
రాష్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆహ్లాదకర వాతావరణంలో అరకు ఉత్సవాలు ఇవాళ ఆరంభమయ్యాయి. విశాఖ జిల్లా అరకులో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను రాష్ట్ర గిరిజన శాఖామంత్రి పి.బాలరాజు ప్రారంభించారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు ఈ వేడుకలకు తరలివచ్చారు. గిరిజన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, ఒడిశా సంబల్ పూర్ కళాకారుల ఆటపాటలు అందరినీ అకట్టుకున్నాయి. మంత్రి బాలరాజు గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో గిరిజనులు పండించిన వివిధ రకాల విత్తనాలను ప్రదర్శనలో ఉంచారు.