: బ్యాంకులో చోరీ.. మూడున్నర కోట్ల రూపాయలు దోపిడీ
హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని మహేష్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. నకిలీ తాళాలతో బ్యాంకు లాకర్లను తెరచిన దుండగులు మూడున్నర కోట్ల రూపాయల నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఉదయం బ్యాంకు తెరిచిన అధికారులు దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.