: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏం జరుగుతోంది?


ఇన్సూరెన్స్ రంగంలోకి ముందుగా ప్రవేశించిన ప్రైవేటు కంపెనీలలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. తొలినాళ్లలో టాటా ఏఐజీ పేరుతో ఉండగా.. అమెరికాకు చెందిన ఏఐజీ భాగస్వామ్యం నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత అది ఏఐఏగా మారింది. అయితే, కొన్ని నెలల క్రితం ఛీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ శరవణన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వివేక్ మాథుర్ కంపెనీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కానీ, ఇంతవరకూ ఆ స్థానాలను టాటా భర్తీ చేయలేదు. సరైన వారి కోసం ఇప్పటికీ వెతుకుతోంది.

వీరి రాజీనామాల వెనుక కారణం ఏంటి? పాలసీదారుల నుంచి వసూలు చేసిన ప్రీమియాన్ని పెట్టుబడులుగా పెట్టే విషయంలో వచ్చిన తేడాలే రాజీనామాలకు దారి తీశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ఇంటర్నల్ ప్యానెల్ తప్పుబట్టడంతో వారు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ(ఐఆర్ డీఏ) ఇన్సూరెన్స్ కంపెనీలు తమ గ్రూపు కంపెనీలలో పెట్టుబడులను 12.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. అంటే టాటా ఏఐఏ బీమా నిధులను తన గ్రూపు కంపెనీలలో 5 శాతానికి మించి పెట్టడానికి లేదు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఇద్దరు అధికారులు గ్రూపు కంపెనీలలో పెట్టుబడులను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ కంపెనీ వీటిని తప్పుబట్టడంతో రాజీనామా చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కంపెనీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

  • Loading...

More Telugu News