: మోసం చేసిన ప్రియుడిపై దాడి చేసిన యువతి


పెళ్లి పేరుతో వంచించిన ప్రియుడిపై ఓ యువతి దాడి చేసింది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం, కాకరపల్లి ప్రతాప్(32) హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. 2001లో అమలాపురంలో డిప్లొమా చదివే సమయంలో అదే ప్రాంతానికి చెందిన రమ్య అనే యువతిని పెళ్లి చేసుకుంటానని లోబరుచుకున్నాడు. ప్రస్తుతం అతను బాచుపల్లిలో, ఆమె చందానగర్ లో ఉంటున్నారు. మే నెలలో ప్రతాప్ కు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రమ్య, పెళ్లి పేరుతో ప్రతాప్ తనను మోసం చేశాడంటూ చందానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేయగా బెయిల్ పై జూన్ లో విడుదలయ్యాడు. నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని ఆగస్టులో పెళ్లి చేసుకున్నాడు.

ఈ క్రమంలో తనను మోసం చేసిన ప్రతాప్ పై కసి పెంచుకున్న రమ్య, బుధవారం ఉదయం 10 గంటలకు బాచుపల్లిలోని అతని ఇంటికి వచ్చింది. అదే సమయంలో స్నానం చేసి లుంగీపై బయటకు వస్తున్న ప్రతాప్ మర్మాంగంపై వెంటతెచ్చుకున్న చిన్న కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ప్రతాప్ తప్పించుకోవడంతో తొడపై గాయాలయ్యాయి. దీంతో, అతన్ని ఇంట్లోకి తోసి వేసి బయట తలుపు గడియ పెట్టి పరారైంది. తరువాత స్నేహితుడి సాయంతో ఆసుపత్రిలో చేరిన ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News