: సోనియా కోటలో మోడీ మంత్రానికి జేజేలు
ఒకనాడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో నేడు సామాన్యుల దగ్గర్నుంచి సంపన్నుల వరకు కాంగ్రెస్ విధానాలను ఛీత్కరించుకుంటున్నారు. మోడీ మంత్రం వారి దగ్గర బాగానే పనిచేస్తోంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను జపిస్తూ ఉంటుంది. ఆహార భద్రత, సబ్సిడీ పథకాలు అంటుంది. వీటినే వాళ్లిప్పుడు అసహ్యించుకుంటున్నారు. మోడీ చెప్పే ఉపాధి, విద్యుత్, ఇతరత్రా అభివృద్ధి మంత్రం వారిని ఆలోచింపజేస్తోంది.
సోనియా నియోజకవర్గం రాయ్ బరేలీలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలోని శివగఢ్ కు చెందిన 52 ఏళ్ల రైతు అర్జున్ రేవాల్ మాట్లాడుతూ.. 'మాకు సబ్సిడీ ఆహారం వద్దు. ఈ విరాళం మాకొద్దు. మాకు ఆస్పత్రులు, వైద్యులు కావాలి. రహదారులు, విద్యుత్ కావాలి. ధరలకు కళ్లెం వేసే వ్యక్తి కావాలి' అని చెప్పారు. మొదటి సారిగా ఈ ప్రాంతంలోని ప్రజలు మరో నేత గురించి మాట్లాడుకుంటున్నారని.. ఆయనే మోడీగా పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ మంచి ఫలితాలను సాధించేలా కనిపిస్తోంది. 80లోక్ సభ సీట్లున్న ఇక్కడ బీజేపీ 27 గెలుచుకుంటుందని ఇప్పటికే ఏసీ నీల్సన్ సర్వే వెల్లడించింది.