: మహిళ గొంతు కోసిన ఆగంతుకులు


అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో ఓ మహిళపై దాడి చేసిన ఆగంతుకులు ఆమె గొంతు కోసి పరారయ్యారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ మహిళ అక్కడకక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ సమాచారం కోసం స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News