: కంచి స్వాముల అరెస్ట్ వెనుక సోనియా, వైఎస్ హస్తం: బీజేపీ
కంచి స్వాముల అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దీని వెనుక సోనియాగాంధీ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హస్తం ఉందని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాజశేఖరరెడ్డి హయాంలో అన్యమత ప్రచారానికి విపరీతమైన ప్రోత్సాహం లభించిందని అన్నారు. తిరుమల ప్రాభవాన్ని తగ్గించేందుకు కూడా వైఎస్ ప్రయత్నించారని విమర్శించారు. కంచి స్వామి అరెస్ట్ పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.