: మహిళలపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మల్లిక
మహిళల విషయంలో భారత్ వెనుకబడ్డ దేశమంటూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బాలీవుడ్ నటి మల్లికాశెరావత్ స్పష్టం చేసింది. దీనిపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు. భారత్ లో ఇప్పటికీ 40 శాతం మంది బాలికలు 18 ఏళ్లలోపే వివాహాలు చేసుకుంటున్నారని, గర్భస్రావాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. పరువు హత్యలను కూడా ఉదహరించింది. అందుకే భారత్ మహిళల విషయంలో చాలా చాలా చాలా వెనుకబడ్డ దేశంగా పేర్కొంది.