: బస్టాండ్ లో రూ. 18 లక్షల బంగారం చోరీ
స్నేహితురాలి పెళ్లికి వచ్చిన ఓ మహిళ సూట్ కేసులో 450 గ్రాములు బంగారు నగలున్న పెట్టెను దుండగులు అపహరించారు. ఈ ఘటన నిన్న రాత్రి విజయవాడ బస్టాండ్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, నిజామాబాద్ కు చెందిన ప్రియాంక అమెరికాలో ఉంటోంది. తన స్నేహితురాలు అనూష వివాహానికి హాజరవడం కోసం ఆమె బుధవారం విజయవాడ వచ్చింది. పెళ్లి అనంతరం నిజామాబాద్ వెళ్లేందుకు నిన్న రాత్రి విజయవాడ బస్టాండ్ కు చేరుకుంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.