: 50 మంది ఈవ్ టీజర్ల అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ రోజు ఉదయం ఆర్పీఎఫ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. లోకల్ రైళ్లలో మహిళలకు భద్రత కరవైందనే ఆరోపణల నేపథ్యంలో, ఈ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా, మహిళలకు కేటాయించిన బోగీల్లో ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.