: టీఆర్ఎస్ దీక్షా దివస్ నేడు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి ఇవాల్టితో నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా, ఇందిరా పార్క్ వద్ద నేడు టీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు, జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకానున్నారు.