: మన మెదడు మాత్రమే పెద్దది ఎందుకంటే...
భూమిపై ఉన్న జీవరాశుల్లో కేవలం క్షీరదాలలోనే మెదడు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దీనికి కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషించారు. ఈ నేపధ్యంలో క్షీరదాల్లోనే మెదడు పరిమాణం పెద్దదిగా ఉండడానికి జన్యువుల్లో తలెత్తిన మార్పులు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు.
బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లింకన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం క్షీరదాల మెదళ్లు మాత్రమే ఎందుకు పెద్దవిగా పెరిగాయి? సంక్లిష్టంగా ఎందుకున్నాయి? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. డాక్టర్ హంబర్టో గ్యుటిరెజ్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో పరిశోధకుల బృందం 39 క్షీరద జాతుల జీనోమ్‌లను పరీక్షించారు. ఈ పరిశోధనలో మెదడు పరిమాణం పెరుగుదలకూ, జన్యు కుటుంబాల విస్తరణకు మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. జన్యు కుటుంబ పరిమాణంలో తలెత్తిన మార్పులు, పరిణామ క్రమంలో మానవుల సహా క్షీరదాల్లో పెద్ద మెదడు ఏర్పడడానికి కారణమై ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.