: మంత్రి డీకే అరుణ భర్తపై కేసు నమోదు
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ భర్త, గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మాజీ ఎంపీపీ జీ. జగన్నాథరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై... షేకుపల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి గత నెలలో కోదండాపురం పోలీస్ స్టేషన్ లో భరతసింహారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో వైఎస్సార్ సీపీ నేత జగన్నాధరెడ్డి... భరత సింహారెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ గద్వాల కోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు భరతసింహారెడ్డి, ఇటిక్యాల మండలానికి చెందిన జింకలపల్లి భీమేశ్వరరెడ్డి, వీరాపురానికి చెందిన దండల రాముడు, మన్నెగౌడ్ లపై 504, 506, 448, 307 ఐపీసీ రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ కాపీలను గద్వాల కోర్టుకు సమర్పించామని ఎస్సై గౌసుద్దీన్ తెలిపారు.