: బీజేపీ అభ్యర్థులకు పాక్ గురువుల మద్దతు


రాజస్థాన్ ఎన్నికల్లో అనేక విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్ సరిహద్దులోని షియో, చొహ్టన్ నియోజకవర్గాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. వీరిపై పాక్ మతగురువుల ప్రభావం ఎక్కువగా ఉంది. పీర్ పగారో, షామక్ధూం, అమిన్ ఫహిమ్ హలవాలా తదితర గురువుల బోధనలను బార్మేర్, జైసల్మేర్ జిల్లాల్లోని అనేక మంది ప్రజలు శ్రద్ధగా వింటారు. బీజేపీ నేత జశ్వంత్ సింగ్ కు పాక్ గురువులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని తమ వర్గానికి చెందిన ఓటర్లకు సూచించారు.

  • Loading...

More Telugu News