: రైతులను ఆదుకుంటాం : మంత్రి పార్థసారధి
వరుస తుపానులతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పార్థసారధి హామీ ఇచ్చారు. ఇవాళ కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మంత్రిని కలిసి నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించడంతో పాటు రుణ మాఫీ చేయాలని కోరారు. నష్టపోయిన వరి పంటకు ఎకరానికి 4 వేలు అందిస్తామని... డిసెంబరు 10 నుంచి రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందజేస్తామని మంత్రి చెప్పారు. రుణ మాఫీ మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని.. దానిపై ఎలాంటి హామీ ఇవ్వలేనని పార్థసారధి పేర్కొన్నారు.